రీ రిలీజ్‌లోనూ విజయం ఖాయం

In the re-release as well Success is sureనిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మాణంలో డైరెక్టర్‌ సెల్వ రాఘవన్‌ వెండితెరపై ఆవిష్కరించిన ఆల్‌ టైమ్‌ కల్ట్‌ క్లాసిక్‌ ‘7/జీ బృందావన్‌ కాలనీ’. రవికష్ణ, సోనియా అగర్వాల్‌ జంటగా నటించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. ఇప్పుడు ఈ సినిమా మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. నిర్మాతలు ఉదరు, యతి ఏయు సినిమాస్‌, వివై ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ద్వారా ఈనెల 22న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా రీరిలీజ్‌ ట్రైలర్‌ని మేకర్స్‌ లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ,’నేను చేసిన ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ‘ ‘7/జీ బృందావన్‌ కాలనీ” కల్ట్‌ మూవీ. ఈ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. తెలుగు, తమిళం రెండూ భాషల్లో పెద్ద విజయం సాధించింది. ఇదొక పొయిటిక్‌ సినిమా. ఉదయ, యతి చాలా శ్రద్ధ తీసుకొని ఈ సినిమాని రీ రిలీజ్‌ చేస్తున్నారు. రీరిలీజ్‌లో కూడా ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుందని నమ్మకం ఉంది. రవితో మళ్ళీ రీఎంట్రీలా ‘7/జీ బృందావన్‌ కాలనీ” పార్ట్‌2ని వచ్చే నెల నుంచి మొదలుపెడుతున్నాం. దీనికికూడా సెల్వరాఘవనే దర్శకత్వం వహిస్తారు. స్క్రిప్ట్‌ అద్భుతంగా వచ్చింది’ అని అన్నారు.

Spread the love