ఇక అన్ని జాతర్లలోనూ ఈ పాటే..

And this is the song in all fairs..దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కిస్తున్న రూరల్‌ న్యూ ఏజ్‌ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ పెదకాపు-1’. ఇంటెన్స్‌ , గ్రిప్పింగ్‌ ట్రైలర్‌ సినిమాపై అంచనాలని పెంచింది. ఫస్ట్‌ సింగిల్‌- రొమాంటిక్‌ మెలోడీ సంచలనంగా మారింది. మ్యూజికల్‌ ప్రమోషన్‌లలో భాగంగా మేకర్స్‌ సెకెండ్‌ సింగిల్‌- జాతర పాటని విడుదల చేశారు. ‘మిక్కీ జె మేయర్‌ స్వరపరిచిన పాట భారీ డ్రమ్‌ సౌండ్‌లతో సంప్రదాయ బీట్స్‌తో ఆకట్టుకుంది. టెంపుల్‌ బ్యాక్‌డ్రాప్‌లో, సంప్రదాయ దుస్తులలో ఉన్న వ్యక్తులతో జాతర వాతావరణం నిండుగా కనిపించింది. అనురాగ్‌ కులకర్ణి తన పవర్‌ ఫుల్‌ వాయిస్‌తో మరింత ఉత్సాహాన్ని నింపాడు. సాయి చరణ్‌, హైమత్‌ కోరస్‌ అదనపు ఎనర్జీ జోడించింది. కళ్యాణచక్రవర్తి త్రిపురనేని అద్భుతమైన సాహిత్యంతో అమ్మవారి పరాక్రమాన్ని వర్ణించారు. రాజు సుందరం కొరియోగ్రఫీ విజువల్స్‌కు మరింత అందం జోడించింది. విరాట్‌ కర్ణ కొన్ని వండర్‌ ఫుల్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌ చేశారు. పాటలో ఇంటెన్స్‌గా కనిపించాడు. ఈ పాట్‌ ఇన్‌స్టంట్‌గా హిట్‌ అయ్యింది. అంతేకాదు ఇకపై అన్ని జాతర ఉత్సవాల్లో ప్లే అవుతుంది. ఈనెల 29న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

Spread the love