నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయించడంలో కృషి చేసిన చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్‌ను పలు కార్మిక సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారంనాడాయన ఇంటికి వెళ్లి సంబురాలు నిర్వహించారు. టీఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి, కన్వీనర్ కత్తుల యాదయ్య, సభ్యులు పీ రవీందర్‌రెడ్డి ఆయనకు పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు. మెజార్టీ యూనియన్ల జేఏసీ చైర్మెన్ అశ్వత్థామరెడ్డి, కన్వీనర్ కే హన్మంతు, కో కన్వీనర్ పీ కమాల్‌రెడ్డి, టీఎమ్‌యూ ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి తదితరలు చైర్మెన్‌కు కలిసి అభినందనలు తెలిపారు.