వ్యాపారస్తులు పోలీసుల సూచనలు, సలహాలు పాటించాలి..

– ట్రాఫిక్ ఏసిపి నారాయణ..
నవతెలంగాణ – డిచ్ పల్లి
జాతీయ రహదారి 44 ప్రక్కన గల వ్యాపార సముదయాల వారు పోలీసుల సూచనలు తప్పకుండా పాటించాలని ట్రాఫిక్ ఎసీపీ నారాయణ అన్నారు.శుక్రవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద నిజామాబాదు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగినవార్ ఆదేశానుసారం జాతీయ రహదారి 44 పై గల వ్యాపార సముదాయాల యాజమానులతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా  ట్రాఫిక్ ఎసిపి నారాయణ పాల్గొని మాట్లాడుతూ వ్యాపార సముదాయాల ముందు జాతీయ రహదారి పై వాహనాలు నిలుపనివ్వ వద్దని,పార్కింగ్ సదుపాయం కల్పించుకోవాలని సూచించారు.వ్యాపారస్తుల సీసీ కెమెరాలని ఏర్పాటు చేసుకోవాలని ఎటువంటి మత్తు పదార్థాలు అమ్మ వద్దని,అదేవిధంగా ప్రతి వ్యాపార సముదాయాలకి జాతీయ రహదారుల సంస్థ నుండి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని వివరించారు.పోలిసుల సూచనలు సలహాలు పాటించాకుంటే అలాంటి వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సమావేశంలో డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేష్, అదికారులు రామారావు, ప్రసన్న, అనిల్, ప్రణయ్, వీరబాబు, స్వామి, వర్ష, రవితేజ,  రోజా, జాక్రన్ పల్లి ఎస్సై తిరుపతి సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love