
నవతెలంగాణ – తొర్రూర్
గ్రామాల్లో ఆచార సాంప్రదాయాలు కొనసాగించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని గ్రామంలోని ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని జడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపెల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండలంలోని పెద్ద మంగ్య తండాలో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ గుడి పండుగ గ్రామాల్లోని ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసి గుడిలోని ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామదేవతల ప్రాముఖ్యత ఎంతో గొప్పదని ఆ సాంప్రదాయాన్ని కొనసాగించడం సంతోషం అని అన్నారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్, జాటోత్ శారదా రమేష్, బీఆర్ఎస్ ఎస్టీ షేల్ మండల్ ఉపాధ్యక్షుడు జాటోత్ యాకేష్, యువజన విభాగం నాయకులు నలమాస సంపత్, దానం భరత్, శీల హరీష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.