Saturday, September 5, 2026
E-PAPER
Homeఆదిలాబాద్పార్డి(బి) గ్రామాన్ని వెంటాడుతున్న విషాదాలు

పార్డి(బి) గ్రామాన్ని వెంటాడుతున్న విషాదాలు

- Advertisement -

తండ్రి మృతి నుంచి తేరుకోకముందే కొడుకు దూరం.. 
వారం రోజుల వ్యవధిలో వరుస విషాదాలు..
నవతెలంగాణ-కుభీర్
మండల పరిధిలోని పార్డి(బి) గ్రామాన్ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత సోమవారం గ్రామానికి చెందిన నలుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాదం మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. శనివారం బ్రహ్మేశ్వర్‌ జలపాతం గుండంలో స్నానం చేస్తుండగా గుడాల సాయినాథ్‌ (48) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. గత నెలలో ఆయన తండ్రి గుడాల రామయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి మరణం బాధ నుంచి కుటుంబ సభ్యులు తేరుకోకముందే 24 రోజుల్లోపు పెద్ద కొడుకు సాయినాథ్‌ను కూడా కోల్పోవడంతో కుటుంబీకుల రోదనలు ఆకాశాన్నంటాయి. ఒకవైపు గ్రామంలో వరుస మరణాలు.. మరోవైపు తండ్రి తర్వాత కొడుకును కోల్పోయిన కుటుంబం.. పార్డి(బి)లో విషాద వాతావరణాన్ని నింపాయి. సాయినాథ్‌ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. మృతుడి భార్య విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ కృష్నారెడ్డి తెలిపారు. కాగా.. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -