31మంది ఐఏఎస్‌ల బదిలీలు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌లతో పాటు యువ అధికారులు నూతన బాధ్యతలు స్వీకరిస్తుండటం గమనార్హం. మొత్తం 31 మంది ఐఏఎస్‌ అధికారుల్ని బదిలీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ (1990) అధికారి శశాంక్‌ గోయల్‌ను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎమ్‌సీహెచ్‌ఆర్డీ) డైరెక్టర్‌ జనరల్‌గా నియమించారు. ఇప్పటి వరకు ఈ విభాగం అదనపు బాధ్యతల్ని నిర్వహిస్తున్న బెన్హర్‌ మహేష్‌ దత్‌ ఎక్కా (1995)ను రిలీవ్‌ చేశారు. మరో సీనియర్‌ ఐఏఎస్‌ (1997) అధికారి శైలజా రామయ్యర్‌ను యువజన సర్వీసు లు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. సందీప్‌ కుమార్‌ సుల్తానియా (1998) ఈ విభాగం బాధ్యతల్ని ఇప్పటి వరకు అదనంగా నిర్వహిస్తున్నారు. ఆయన్ని రిలీవ్‌ చేశారు. జీహెచ్‌ఎంసీలో అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న ప్రియాంక అలా (2016) ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా నియమించారు. ఇక్కడే అడిషనల్‌ కలెక్టర్‌ (స్థానిక సంస్థలు)గా పనిచేస్తున్న అనుదీప్‌ దురిశెట్టి (2018) ఇప్పటి వరకు ఈ జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు. ఆయన్ని రిలీవ్‌ చేసి, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా నియమించారు. వివరాలు ఇలా….
1. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి
2. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల
అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌
3. యువజన సర్వీసులు,
పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌
4.ఆయుష్‌ డైరెక్టర్‌ దాసరి హరిచందన
5.కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి కష్ణ ఆదిత్య
6. తెలంగాణ స్టేట్‌ ఫుడ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీత సత్యనారాయణ
7. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ప్రతీక్‌ జైన్‌
8.సెర్ప్‌ సీఈవో పాట్రు గౌతమ్‌
9.గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ 10. నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ మంద మకరందు
11. ములుగు జిల్లా కలెక్టర్‌ ఐలా త్రిపాఠి
12. పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ ముజమిల్‌ ఖాన్‌
13. ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి కే హరిత
14. హస్త కళల అభివద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అలుగు వర్షిణి
15. క్రీడల శాఖ డైరెక్టర్‌ కొర్రా లక్ష్మి
16. ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ డైరెక్టర్‌ హైమావతి
17. పర్యాటక శాఖ డైరెక్టర్‌ కే నిఖిల
18. వ్యవసాయ శాఖ ఉప కార్యదర్శి సత్య శారదాదేవి
19. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ స్నేహ శబారిష్‌
20. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ ప్రియాంక ఆల
21. మహబూబ్‌నగర్‌ అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రే
22. జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కే స్వర్ణలత
23. ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌
24. కామారెడ్డి అదనపు కలెక్టర్‌ మను చౌదరి
25. జగిత్యాల అదనపు కలెక్టర్‌ టీఎస్‌ దివాకర్‌
26.నాగర్‌ కర్నూల్‌ అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌
27. పెద్దపల్లి అదనపు కలెక్టర్‌ చెక్క ప్రియాంక
28. కరీంనగర్‌ అదనపు కలెక్టర్‌ జల్దా అరుణశ్రీ
29. సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ బడుగు చంద్రశేఖర్‌
30. రంగారెడ్డి అదనపు కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌
31. సిద్దిపేట అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌

Spread the love