417మంది తహసీల్దార్ల బదిలీలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో పెద్ద ఎత్తున తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. రెండు మల్టీజోన్ల పరిధిలో 417 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. మూడేండ్లకుపైగా పని చేస్తున్న తహసీల్దార్లను బదిలీ చేస్తూ సీసీఎల్‌ఏ ఆదేశాలు చేసింది. తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం బదిలీలు చేసింది. అయితే గతంలో రాండమ్‌గా బదిలీ చేస్తే రాష్ట్రంలో మారుమూల ప్రాంతానికి పోస్టింగ్‌ ఇచ్చేవారు. ఈ సారి మాత్రం రెండు మల్టీజోన్ల పరిధిలోనే బదిలీ చేయడంతో సమీప జిల్లాలనే పోస్టింగ్‌ వచ్చిందని పలువురు తహసీల్దార్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Spread the love