సీనియర్ డాన్స్ మాస్టర్ లకు సన్మానం..

నవతెలంగాణ – వేములవాడ 
ప్రపంచ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ, జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమాఖ్య ప్రధాన కార్యాలయంలో శ్రావణపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన సీనియర్ డాన్స్ మాస్టర్ లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాటికొండ లత బొడ్డు నారాయణ గుమ్మడి రాజేశం హాజరయ్యారు.  అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 20 మంది డాన్స్ మాస్టర్లను ఆహ్వానించి వారిని ఘనంగా సత్కరించారు.  అనంతరం  ఎలా పోశెట్టి మాట్లాడుతూ సాంస్కతిక కలలు కనుమరుగు కాకుండా చూసే బాధ్యత నృత్య అధ్యాపకులపై ఉందని గుర్తు చేశారు. నృత్యం నటరాజ  స్వరూపమని అన్నారు, నృత్యం ఆవ భావాలను పలికించడం నృత్యదర్శకులకే అది సాధ్యం, నృత్యంతో భావాన్ని వ్యక్తపరచడం గొప్పకళా అని తెలిపారు. కార్యక్రమంలో గడ్డం దేవయ్య, బొంగోని ఆంజనేయులు, ప్రముక డ్యాన్సర్ , కొరియోగ్రాఫర్ మారం ప్రవీణ్ పప్పీ, గంగ శ్రీకాంత్ తాళ్లపల్లి నాగరాజు , కత్తెరపాక శ్రీనివాస్, బండి హరీష్, సంటి రాజేందర్, మానువాడ లక్ష్మీనారాయణ, తదితరులు ఉన్నారు.
Spread the love