నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజివ్ గాంధీ రెండు పర్యాయాలు భారతదేశనికి ప్రధాన మంత్రి గా పని చేశారని. అతి చిన్న వయస్సులొనే 40 ఏళ్ల కే దేశానికి ప్రధాన మంత్రి అయ్యారన్నారు. దేశానికి టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థ, భారతాన్ని ఆధునిక యుగం వైపు నడిపించిన యువ నాయకుడు, ఐటీ రంగానికి పితామహుడుగా, టెలికమ్యూనికేషన్ విప్లవానికి ఆద్యుడుగా, దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడిగా రాజీవ్ గాంధీ గారిది ఎన్నటికీ చెరగని ముద్ర అన్నారు.
గ్రామ స్వరాజ్య సాధనకు పునాదులు వేసి, స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, యువతకు 18ఏళ్లకే ఓటు హక్కు కల్పించి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. అని, ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ చూపిన బాట నేడు ప్రతి ఒక్కరు చూపించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నందునాయక్, AMC ఛైర్మన్ లక్ష్మీ నారాయణ పట్టణ అధ్యక్షులు మంద రాజేష్ ,జిల్లా ఉపాధ్యక్షులు, గుర్రం మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇస్సాక్, జిల్లా కార్యదర్శి ముజాఫర్ AVR ఇందయ్యా, రమేష్, సీనియర్ నాయకులు, సర్పంచ్ లు, వార్డు సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, మహిళ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


