
మార్చి 1న ” మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ టౌన్ బోర్గం (పి) డా. బాబు జగ్జీవన్ రామ్ వద్ద ఎం ఎస్ పి నిజామాబాద్ జిల్లా ఇంఛార్జి గంధమాల నాగభూషణం మాదిగ ఆధ్వర్యంలో మాదిగ ఉద్యమ అమరులకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా సీనియర్ ఉద్యకరుడిగా గంధమాల నాగభూషణం మాదిగ మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ ఉద్యమం 1994 జులై 7న ఏర్పడి నేటికి సుమారుగా 30 సం..లు.. అవుతుంది.ఎస్సీ వర్గీకరణ సాధనకై అలుపెరుగని పోరాటం, నాటి నుండి నేటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగల ఉద్యమం పై ద్వంద వైఖరి వల్ల, నిర్లక్ష్యం వల్ల, మోసపూరిత వైఖరి వల్ల మాదిగ యువత లక్ష్య సాధనలో భాగంగా ప్రాణాలను సైతం కోల్పోవడం చాలా బాధాకరం ఈ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగలను వంచించాయే గాని మాదిగ జాతి కి న్యాయం చేయకపోవడం వల్ల విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని కావున ఇప్పటికైనా పార్లమెంట్ ఎన్నికల లోపే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాదిగ,మాదిగ ఉప కులాలకు న్యాయం చేయాలని లేనియెడల..అమరుల దినోత్సవం సాక్షిగా వారి ఆశయాలను సాధించే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వదిలే ప్రసక్తే లేదని, అమరుల త్యాగాలు వృధా కానివ్వమని శపథం చేస్తూ జోహార్ మాదిగ అమరవీరులకు జోహార్, జోహార్, అని నివాళులు అర్పిస్తూ కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమం లో ఎం ఎస్ పి జిల్లా సీనియర్ నాయకుడు డల్లా సురేష్ మహాజన్,కార్యక్రమంలో పాల్గొన్నవారు పట్టణ అధ్యక్షడు శివ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు సురేష్ మాదిగ ఉద్యోగస్తుల అధ్యక్షులు సురేష్ మాదిగ మాజీ అధ్యక్షులు తెడ్డు గంగారాం, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సంతోష్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు క్రిస్టియన్ మాదిగ మహిళా విభాగం అధ్యక్షురాలు పుష్పలత, మహిళా నాయకురాలు సావిత్రి మాదిగ, ఎంఈఎఫ్ గంగారాం మాదిగ, రాములు మాదిగ తదితరులు పాల్గొన్నారు.