తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మెన్ కె.శివసేనారెడ్డి
నిరంతర అధ్యయనంతోనే జర్నలిజంలో ఎదుగుదల
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ శ్రీనివాస్రెడ్డినవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేదే నిజమైన జర్నలిజం అని తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీ చైర్మెన్ కె.శివసేనా రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని నాంపల్లిలో గల తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను మెరుగుపర్చే శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లడుతూ..మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు తమ వృత్తి నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలని సూచించారు. మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమని చెప్పారు. రాజకీయ, అధికార ఒత్తిళ్లకు లొంగకుండా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వాస్తవాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఫేక్ న్యూస్ వ్యాప్తి పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాస్తవ నిర్ధారణ (ఫ్యాక్ట్ చెకింగ్), నైతిక విలువలు, విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. చిన్న పత్రికలు, డిజిటల్ మీడియా, యూట్యూబ్ వేదికల్లో పనిచేసే జర్నలిస్టుల్లోనూ విశేష ప్రతిభ ఉందని, నిజాయితీతో పనిచేసే వారికి గుర్తింపు తప్పకుండా లభిస్తుందని చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంతటి అనుభవమున్నప్పటికీ జర్నలిస్టులు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం, చట్టాలు, సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. గ్రామీణ జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా మీడియా అకాడమీ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. సీనియర్ జర్నలిస్టులు దిలీప్ రెడ్డి, మార్కండేయ, సుధాకర్ రెడ్డి, గోవింద్ రెడ్డి డిజిటల్ జర్నలిజం, సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ), మీడియా నైతిక విలువలు, సమకాలీన జర్నలిజం అంశాలపై అవగాహన కల్పించారు. .ఇతర నిపుణులు జర్నలిజంలో వృత్తి నైతిక విలువలు, వార్తా రచనలో ప్రమాణాలు, డిజిటల్ యుగంలో జర్నలిస్టులు అనుసరించాల్సిన బాధ్యతలు, మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ, వెట్టి చాకిరి నిర్మూలన, బాధితుల పునరావాసంలో మీడియా పోషించాల్సిన పాత్రపై సమగ్రంగా వివరించారు. అనంతరం సామాజిక సందేశంతో రూపొందిన “నెరవేరిన కల” ఫీచర్ చిత్రాన్ని ప్రదర్శించారు. శిక్షణాశిబిరంలో తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్. వెంకటేశ్వరరావు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మధు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేదే నిజమైన జర్నలిజం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



