Monday, July 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఓబీసీ కుటుంబాలను లెక్కించాల్సిందే

ఓబీసీ కుటుంబాలను లెక్కించాల్సిందే

- Advertisement -

కుల గణనకై పార్లమెంట్ లో పోరాడుతాం : మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో – హదరాబాద్

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తుతం జరుగుతున్న జనగణలో ఓబీసీ కుటుంబాలను లెక్కించాలని, బీసీ కుల గణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు లో పోరాడుతామని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆగస్టు 7న బెంగుళూరులో జరిగే జాతీయ ఓబీసీ మహాసభలకు హాజరు కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలోని బీసీ ప్రతినిధుల బృందం ఆదివారం హైదరాబాద్ లో మహేశ్ కుమార్ గౌడ్ ను కలిసి ఆహ్వానించారు. అనంతరం మహాసభలను విజయవంతం చేయాలని వాల్ పోస్టర్ ను జాజుల శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో బీసీలకు చట్టబద్ధమైన హక్కులు దక్కాలంటే జాతి జనగణలో సమగ్ర కులగణన చేపట్టి బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -