ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకోవాలి :
మహిళా రిజర్వేషన్ సంయుక్త కార్యాచరణ కమిటీ డిమాండ్
సీపీఐ(ఎం),బీఆర్‌ఎస్, సీపీఐ, మాస్‌లైన్ నేతలకు వినతిపత్రాల అందజేతనవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్ డీలిమిటేషన్, 2011 జనగణనతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు అవసరమైన చర్యలను ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే చేపట్టాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు అనసూయ, ఎస్‌ఎఫ్‌ఏడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.జ్యోతి, పీఓడబ్ల్యూ 2 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వరూప, సిఎమ్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. జ్యోతి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్), సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.రమకు వినతిప్రతాలను మహిళా సంఘాల ప్రతినిధులు అందజేశారు. అనంతరం మహిళా సంఘాల ప్రతినిధులు మాట్టాడుతూ...కాంగ్రెస్, బీఆర్‌ఎస్, సీపీఐ(ఎం), సీపీఐ ఎంపీలు తమ డిమాండ్లకు మద్దతు ప్రకటించాలనీ, పార్లమెంట్ మహిళల తరఫున గళం వినిపించాలని కోరారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జనాభా లెక్కలు, పునర్విభజన నుంచి మహిళా రిజర్వేషన్ అమలును వేరుచేసే సవరణను ఆమోదించాలని డిమాండ్ చేయాలని విన్నవించారు. దీనివల్ల పార్లమెంటు, శాసనసభలలో మూడింట ఒక వంతు సీట్ల రిజర్వేషన్ తక్షణమే అమలు అవుతుందని తెలిపారు. శాసనసభలలో మహిళా ఎమ్మెల్యేల సగటు సంఖ్య 10 శాతం కంటే తక్కువగా ఉన్నదని ఎత్తిచూపారు. అనేక శాసనసభలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటువంటి చర్య యొక్క ఆవశ్యకతను ఎంత చెప్పినా తక్కువేనన్నారు. రాజ్యాంగం 106వ సవరణ చట్టానికి సవరణ చేయడం ద్వారా మాత్రమే దీనిని సాధించగలమని చెప్పారు. 2023 చట్టం అమలును మరింత ఆలస్యం చేసే, సమాఖ్య, ప్రజాస్వామ్య స్వరూపాన్ని ప్రమాదంలో పడేసే అంశాలతో మహిళా రిజర్వేషన్లను ముడిపెట్టే ఏ ప్రతిపాదననైనా ఓడించడానికి పార్లమెంటులో చొరవ తీసుకోవాలని ఆయా పార్టీల నేతలను కోరారు. వినతిపత్రాలు అందజేసిన వారిలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్. అరుణ జ్యోతి, ఐద్వా రాష్ట్ర సహాయకార్యదర్శి కె.ఎన్.ఆశాలత, పి. శశికళ, తదితరులు పాల్గొన్నారు.
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



