విభజన హామీలు అమలు చేయాలి: తుమ్మల వెంకటరెడ్డి

నవతెలంగాణ- గోవిందరావుపేట
విభజన హామీలు వెంటనే అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం ఉపాధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని పసర గ్రామంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బి సంజీవ  ఆధ్వర్యంలో విభజన హామీలను అమలు చేయడంతో పాటు ఆవాస్ యోజన పథకం కింద అర్హులైన పేదలకు 10 లక్షల రూపాయలు ఇంటిన నిర్మాణం కోసం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 163 వ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి వెంకటరెడ్డి మాట్లాడారు. గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా అనేకసార్లు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన మోడీ విభజన హామీలను అమలు చేస్తానని చెప్పి ఇప్పటివరకు ఒక్క హామీ కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని బడా పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ ఆదా నీ అంబానీలకు సబ్సిడీల పేర కోట్ల రూపాయలను ఉచితాలుగా ఇస్తూ రెక్కాడితే డొక్కాడని పేదలపై  జీఎస్టీ ల పేరుతోటి గ్యాసు ఉప్పు పప్పు కనీస అవసరాలపై పెనుబారాలు మోపుతూ పేదల నడ్డి విరుస్తుందని పెద్దలకు దూసి పెట్టే పనిపై ఉన్న శ్రద్ధ పేదలపై లేదని వారు ఎద్దేవా చేశారు రెండు కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు ఇస్తానని నమ్మబలికి రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నేటి వరకు ఒక హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు తెలంగాణ ప్రజల ముందుకు రావడానికి సిగ్గుండాలి అని  వారు విమర్శించారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజలపై చిత్త శుద్ధితో వ్యవహరించి విభజన హామీలను పూర్తిగా అమలు చేయాలని దేశంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల అన్ని భర్తీ చేయాలని ఆవాస్ యోజన పథకం కింద అర్హులైన నిరుపేద కుటుంబాల అందరికీ ఇంటి నిర్మాణం కోసం పది లక్షల రూపాయలు ఇవ్వాలని వారు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనియెడల పెద్ద ఎత్తున ప్రజల ను ఐక్యం చేసి ఉద్యమాలు చేస్తామని వారు ఈ ప్రభుత్వాలను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రైతు సంఘం నాయకులు కడారి నాగరాజు కేతం సూర్యనారాయణ జిత్తబోయిన రమేష్ పల్లపు రాజు సీతారామరాజు బ్రహ్మచారి ఉపేంద్ర చారి మహిళా సంఘం నాయకులు మంచాల కవితా కారం రజిత కందుల రాజేశ్వరి జిమ్మ జ్యోతి డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు పిట్టల అరుణ్ సిరిపల్లె జీవన్ గణేష్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love