మృతుల కుటుంబాల పరామర్శించి ఆర్థిక సహాయం

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పలువురు మృతుల కుటుంబాలను జడ్పిటిసి తుమ్మల హరిబాబు శుక్రవారం పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ముందుగా మండల కేంద్రానికి చెందిన కాగితాల సుదర్శన్ 65సం” మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి 3000 రూ ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం పసర గ్రామానికి చెందిన కందికట్ల వెంకటయ్య 60సం” అనారోగ్యంతో బాధపడుతూ మరణించగా పరామర్శించి వారి కుటుంబానికి 4000 రూపాయలు  ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమాలలో ఆయన వెంట కో అప్షన్ సభ్యులు బాబర్, నాయకులు బొల్లం శివ,తుమ్మల శివ, మునిగల వెంకన్న, కిర్తి రవి, జన్ను కరుణాకర్ తదితరులు ఉన్నారు.
Spread the love