– కమ్మర్ పల్లి ఎస్ఐ రాజశేఖర్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన నలుగురు వ్యక్తులకు మద్యం సేవించి వాహనాలు నడిపినందుకు రెండు రోజుల అజ్జలు శిక్ష పడినట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ రాజశేఖర్ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురినీ ఆర్మూర్ కోర్టు లో హాజరు పరచగా ఇంచార్జ్ న్యాయమూర్తి శ్రీనివాస్ రావు రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, పోలీస్ తనిఖీల్లో పట్టుబడితే జైలు శిక్షకు గురికావాల్సి వస్తుందని తెలిపారు.