మరో ఇద్దరు ఎంపీలపై వేటు..

Attack on two more MPs..– ప్రతిపక్షాల ఆగ్రహం
– మూడు క్రిమినల్‌ చట్టాల సవరణ బిల్లులు,టెలి కమ్యూనికేషన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్‌లో భత్రా వైఫల్యంపై చర్చించాలనీ, కేంద్ర హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ వేస్తూ ఆందోళన చేసిన మరో ఇద్దరు ఎంపీలపై మోడీ ప్రభుత్వం వేటు వేసింది. సీపీఐ(ఎం) ఎంపీ ఎఎం ఆరీఫ్‌, కేరళ కాంగ్రెస్‌ ఎంపీ థామస్‌ చజికదన్‌లను స్పీకర్‌ ఓం బిర్లా బుధవారం సస్పెండ్‌ చేశారు. తాజా వేటుతో ఈ సెషన్‌లో సస్పెండ్‌ అయిన వారి సంఖ్య 143కు చేరింది. సభ్యుల సస్పెన్షన్‌పై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. అనంతరం స్పీకర్‌ ఓం బిర్లా తన నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్‌ ఎలా చేస్తారంటూ ప్రతిపక్ష సభ్యులు నిరసనలు తెలిపారు. సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా పార్లమెంటు ఆవరణలో ఎంపీలు సేవ్‌ డెమోక్రసీ నినాదాలతో ఆందోళన చేపట్టారు.
మూడు క్రిమినల్‌ చట్టాల సవరణ బిల్లులు ఆమోదం
బ్రిటిష్‌ హయాం నుంచి అమలులో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), సాక్ష్యాధార చట్టం (ఎవిడెన్స్‌ యాక్ట్‌) స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చేందుకు రూపొందించిన మూడు నేర శిక్షాస్మృతి బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బీజేపీ, దానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇచ్చే పార్టీలతో తూతూమంత్రంగా చర్చ జరిపి కీలకమైన బిల్లులను ఆమోదించారు. పై మూడు చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య (బీఎస్‌) పేరుతో మూడు కొత్త బిల్లులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో వీటిని కేంద్రం వెనక్కు తీసుకుంది. ఆ తరువాత వీటిలో మార్పులు చేసి.. ‘భారతీయ న్యాయ (రెండో) సంహిత’, ‘భారతీయ నాగరిక్‌ సురక్షా (రెండో) సంహిత’, ‘భారతీయ సాక్ష్య (రెండో)’ బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టారు. ఈ మూడు బిల్లులను లోక్‌సభ ఆమోదించడంతో వాటిని రాజ్యసభకు పంపనున్నారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే వీటిని ఆమోదించుకోవాలని
మరో ఇద్దరు ఎంపీలపై వేటు.. కేంద్రం యోచిస్తున్నది.
టెలి కమ్యూనికేషన్‌ బిల్లు ఆమోదం
లోక్‌సభలో టెలి కమ్యూనికేషన్‌ బిల్లు ఆమోదం పొందింది. ఆన్‌లైన్‌ కమ్యూనికేషన్‌ సేవలను బిల్లు పరిధిలోకి చేర్చారా లేదా అని ముగ్గురు ఎంపీలు అడిగినప్పటికీ సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పష్టం చేయలేదు. బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. అలాగే రాజ్యసభలో సీజీఎస్టీ రెండో సవరణ బిల్లు ఆమోదం పొందింది.

Spread the love