– ఒకరు ఏఎల్‌ఓ, మరొకరు తహశీల్దార్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో రెండు వేర్వేరు జిల్లాల్లో లంచాలు తీసుకుంటూ ఒక తహశీల్దారు, మరో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్(ఏఎల్‌ఓ)లు అవి నీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలకు చిక్కారు. ఏసీబీ డీజీ డాక్టర్ రవి గుప్తా తెలిపిన వివరాల ప్రకా రం.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఏఎల్‌ఓ సుమతిని తన కార్యాలయం వద్దే ఒక వ్యక్తి నుంచి రూ. 20 వేలను లంచం గా తీసుకుంటుండగా ఏసీబీ అధి కారులు వల పన్ని రెడ్‌హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వెంకన్న అనే వ్యక్తికి లేబర్‌కార్డును జారీ చేయటంతో పాటు మరణించిన అతని కుమారుడికి మంజూరైన లక్ష రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించటానికిగానూ సుమతి ఇంత మొత్తంలో లంచాన్ని డిమా ండ్ చేశారు. అలాగే, ఖమ్మం జిల్లా ఎన్‌కౌర్ మండల తహశీల్దార్ మహ్మద్‌షా ఖాసీం ఒక వ్యక్తి నుంచి రూ.3000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రామకృష్ణ అనే వ్యక్తికి చెందిన ఆస్థి పంపకానికి సంబంధించిన పత్రాలు ఇవ్వటానికి గానూ ఈ డబ్బును షా ఖాసీం డిమాండ్ చేసి తీసుకున్నారు. అరెస్టు చేసిన ఇద్దరిని హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.