అధికారంలోకి వచ్చిన రేండు రోజుల్లోనే రెండు పథకాలు..

– ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..
– ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి ఎమ్మెల్యే అధికారుల ప్రయాణం..
నవతెలంగాణ- డిచ్ పల్లి.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అరు గ్యారంటీ కార్డు హామీ లను అదికారంలోకి వచ్చిన రేండు రోజుల్లోనే అమలు చేసి చూపమని,
రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు.ఎమ్మేల్యెగా ప్రమాణ స్వీకారం చేసి మొదటి సారి జిల్లాకు, నీయోజకవర్గనికి వస్తున్న సందర్భంగా ర్యాలీ అనంతరం అధికారికంగా డిచ్ పల్లి ఆర్టీసీ బస్టాండ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఎం భూపతి రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రజలకు ఆరు గ్యారెంటీలను అదికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తామని వాగ్దానం చేశారని, డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా అదికారంలోకి వచ్చిన రేండు రోజుల్లోనే రెండు పథకాలు అమలు చేసి చిత్తశుద్ధి నుంచి నిరుపించమని పేర్కొన్నారు.మిగిలిన హామీ లను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ఎవరికి ఏలాంటి అందోళన అవసరం లేదన్నారు. మహిళలకు వయస్సుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్లలో రాష్ట్ర సరిహద్దు వరకు ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం జీరో చార్జీ టికెట్ అందిస్తారని చెప్పారు. ఇది మహిళా సాధికారతకు దోహదపడడంతో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణం వల్ల మహిళలకు రక్షణ ఉంటుందని తెలిపారు. ప్రతి మహిళా ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ అధికారులు, నాగేష్ రెడ్డి, ఇమ్మడి గోపి,పోలసాని శ్రీనివాస్,మోత్కురి నవీన్ గౌడ్, అమృత పూర్ గంగాధర్, మునిపల్లి సాయరెడ్డి, ముప్ప గంగారెడ్డి, శేఖర్ గౌడ్,గాడిల రాములు, కంచేట్టి గంగాధర్, డాక్టర్ శాదుల్లా, తరచంద్ నాయక్, శ్యాంసన్, డాక్టర్ శ్రీనివాస్, సంతోష్ రెడ్డి, సుదకర్, దర్మగౌడ్, కంట్రోలర్ చందర్ నాయక్,దాస్, దత్తు తో పాటు మహిళలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Spread the love