Thursday, July 9, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅర్థం చేసుకో..‘రా’?!

అర్థం చేసుకో..‘రా’?!

- Advertisement -

​పాపభీతి పోయాక
దేవుడేంది? గుడులేంది ?
నైతికత తీసిపారేశాక
మతం ఏంది? ధర్మం ఏంది?
మా రాజధర్మం మాకున్నాక
ఈ న్యాయమేంది? చట్టాలేంది?

ప్రశ్నను బొక్కలో వేసాక
ఇక బోనులోనే
లైంగికదాడులు చేపట్టినవారికి
హారతులివ్వడం మా ఆచారం
ఉద్యమాలపై ఊరకుక్కలను
ఉసికొల్పడం మా కట్టుబాటు

జ్ఞానం ఎంత ప్రమాదకరం ?
రాముడు అందుకే
శంభకున్ని వధించాడు
ప్రమాదం అనిపిస్తే చాలు
మా జైళు నోళ్లు తెరుస్తాయి.
కాదంటే చీకటి రాజ్యం
కండ్లు తెరుస్తుంది

మహాత్మున్ని మట్టుపెట్టలేదా..?
గౌరీలంకేష్ అంతం కాలేదా?
అప్పుడైనా ఇప్పుడైనా …
దేన్ని తేల్చిచెప్పం
అదే మా ధర్మాచరణ
అర్థంకాకపోతే ఎలా..?
​-శైలి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -