
ఫిబ్రవరి 16 దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్ పోస్టర్లను నవీపేట్ మండల కేంద్రంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల మొండి వైఖరిని అవలంబిస్తూ కార్మికులకు తీరని అన్యాయం చేస్తుందని అన్నారు. కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం వలన కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్త సంయుక్త కిసాన్ మోర్చ, రైతు సంఘాలు, వ్యవసాయ కూలీలు పాల్గొంటున్నాయని కాబట్టి జిల్లా వ్యాప్తంగా సైతం అన్ని కార్మిక వర్గాలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బద్దం పోశెట్టి, దేవకి, రాధా, డ్రైవర్ పోశేట్టి తదితరులు పాల్గొన్నారు.