నిరుపయోగంగా గోపాల్ మిత్ర భవనం..

నవతెలంగాణ- రెంజల్

రెంజల్ మండలం బోర్గం గ్రామంలో నిర్మించిన గోపాల్ మిత్ర భవనం నేడు నిరుపయోగంగా మారింది.బోర్గం గ్రామంలో పశు సంపదతో పాటు, గొర్రెలు మేకలు అధిక సంఖ్యలో ఉండడం వలన ఇక్కడ ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవన నిర్మాణం ఎనిమిది లక్షల 40 వేల రూపాయల వ్యయంతో నిర్మించగా కొన్ని రోజులు మాత్రమే వాడకంలో ఉండేదని, ప్రస్తుతం గ్రామంలోని నీరు ఈ భవనం చెట్టు చేయడం, కాంట్రాక్టర్ భవనంలోని నాసిరకంగా పనులు నిర్వహించడం వల్ల పాములు రావడంతో దానిని శాశ్వతంగా మూషించారు. మనం చుట్టూ ముళ్లపదలు చెట్లతో నిండుకొని ఉంది. స్థానిక వైద్య సిబ్బంది రైతుల ఇంటి వద్దనే వైద్యం చేస్తూ ఉండటంతో ఇది నిరుపయోగంగా మారింది..
Spread the love