Saturday, August 22, 2026
E-PAPER
Homeజిల్లాలుఉప్లూర్ లో వలగొడుగు ఉత్సవం

ఉప్లూర్ లో వలగొడుగు ఉత్సవం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ లో ఆదివారం స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వలగొడుగు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని కషీర్ నుండి పెద్దమ్మ పోచమ్మ దేవాలయం వరకు డప్పు చప్పులతో వల గొడుగుతో ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు సందర్భంగా పోతరాజుల నృత్యాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. వలగొడుగు ఊరేగింపు సందర్భంగా  గుండ్ల వాళ్ళు వలగొడుగు పట్టగా, చాకలి వారు రోడ్డుపై బట్టలు పరిచారు. అనంతరం గోదావరి నదిలో ప్రత్యేకంగా తీసుకువచ్చిన జలాలతో వర్షాలు పుష్కలంగా పడాలని గ్రామ దేవతలకు జలాభిషేకాలు చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జెల్ల సదానంద్, బద్దం రాజేశ్వర్ రెడ్డి, ఎనడ్ల మురళి రెడ్డి, యాల అశోక్ రెడ్డి, సుంకరి విజయ్ కుమార్, బద్దం తిరుపతిరెడ్డి, కొత్తపల్లి అనిల్, దాసరి రాకేష్, మహమ్మద్ సల్మాన్, మహమ్మద్ సాదిక్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -