స్లీప‌ర్ కోచ్‌ల‌తో వందేభార‌త్..

నవతెలంగాణ- న్యూఢిల్లీ: వందేభార‌త్ ఏసీ రైళ్ల‌ను ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే సుదీర్ఘ దూరం ప్ర‌యాణించే వారిని దృష్టిలో పెట్టుకుని, వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్ స్లీప‌ర్ కోచ్‌ల‌ను తీసుకురానున్న‌ట్లు ఇంటిగ్ర‌ల్ కోచ్ ఫ్యాక్ట‌రీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ బీజీ మాల్యా తెలిపారు. ఈ ఆర్ధిక సంవ‌త్స‌రంలోనే స్లీప‌ర్ వ‌ర్ష‌న్‌కు చెందిన వందేభార‌త్ రైలును ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ క్రమంలో మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం ఇస్తూ.. వందేభార‌త్ మెట్రో రైలును కూడా ఈ ఆర్ధిక సంవ‌త్స‌రంలోనే ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. నాన్ ఏసీ ప్ర‌యాణికుల కోసం వందే మెట్రో రైళ్ల‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. దీన్నే నాన్ ఏసీ పుష్‌పుల్ ట్రైన్ అంటార‌న్నారు. దీనికి 22 కోచ్‌ల‌తో పాటు ఓ ఇంజిన్ ఉంటుంద‌న్నారు. ఈ ఏడాది అక్టోబ‌ర్ 31వ తేదీ లోగా వందే మెట్రో రైళ్ల‌ను స్టార్ట్ చేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

Spread the love