సమాజ మార్పుకు బుద్ధుని బోధనలు అవసరం: వీరన్న యాదవ్

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
మతం ముసుగులో కొనసాగుతున్నటువంటి ప్రస్తుత వ్యవస్థను మార్చడానికి బుద్ధుని బోధనలు ఎంతో అవసరమని జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ అన్నారు. బుద్ధుని 2587వ జయంతి వేడుకలను హుస్నాబాద్ లోని విద్యా వాణి ఉన్నత పాఠశాలలో ఘనంగా  నిర్వహించారు. అనంతరం బుద్ధుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ  కోఆర్డినేటర్ మేక ల వీరన్న యాదవ్ మాట్లాడుతూ మనుషులందరూ సమానమే అనే  మహోన్నత ఆశయాన్ని  ప్రజల్లోకి తీసుకెళ్ళలని అన్నారు. కోరికల బారిన చిక్కి దుఃఖం వైపు మనిషి  పయ నించకుండా ప్రకృతి నియమావలి కి అనుగుణంగా జీవించాలని, బోధించిన ఆ మహనీయుని  బోధనలు నేటికీ ఏనాటికైనా  ఆచరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో  జేఏసీ బాధ్యులు వడ్డేపల్లి మల్లేశం, ఇల్లెందుల లక్ష్మణ్ గౌడ్,  పొన్నాల ఫ్రాన్సిస్,  నాంపల్లి సమ్మయ్య తదితరులు  పాల్గొన్నారు.
Spread the love