బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించడానికి హైదరాబాద్ విచ్చేసిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. ఈ మేరకు గురువారం బేగంపేట విమనాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ కు ప్రశాంత్ రెడ్డి, పల్లె రాజేశ్వర్ రెడ్డితో కలిసి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.అనంతరం ముఖ్యమంత్రి జగన్ తో కలిసి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి,పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్ ఇంటికి బయలుదేరి వెళ్లారు.