మజ్జిగతో ఎంతో మేలు..

మజ్జిగతో
ఎంతో మేలు..రోజు మొత్తం మీద ఒక గ్లాసు చల్లని మజ్జిగను తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు. వేసవిలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు మజ్జిగ చక్కని పరిష్కారం.
మజ్జిగలో పొటాషియం, కాల్షియం, విటమిన్‌ బి అధికంగా ఉండి శరీరానికి పోషకాలు లభిస్తాయి.
ఇందులో ప్రోబయోటిక్‌ వంటి ఉపయోగకరమైన బ్యాక్టీరియా జీర్ణక్రియను పెంచి, మలబద్దక సమస్యను తగ్గిస్తుంది.
రోజూ ఉదయం మజ్జిగ తాగడం వల్ల కడుపులో మంట, ఎసిడిటి సమస్యలు తగ్గుతాయి.
మజ్జిగలో కరివేపాకు, జీలకర్ర, మిరియాలపొడి వంటి పదార్థాలను చేర్చి తాగడం వల్ల అనేక ఔషధ గుణాలను పొందవచ్చు.
పొట్ట ఉబ్బరంగా ఉన్నప్పుడు గ్లాసు మజ్జిగలో అల్లం లేదా జీలకర్ర పొడి కలిపి తాగితే త్వరగా ఉపశమనం కలుగుతుంది.
డీహైడ్రేషన్‌కి గురైనప్పుడు ఒక గ్లాసు మజ్జిగలో కొన్ని మసాలా దినుసులు, ఉప్పు కలిపి తీసుకుంటే మంచిది.
మజ్జిగ వల్ల శరీరంలోని కొవ్వు శాతం కంట్రోల్‌ అయ్యి రక్త ప్రసరణ (బీపీ) తగ్గుతుంది.
మజ్జిగలో ఉండే బయో యాక్టివ్‌ ప్రోటీన్‌, యాంటీ క్యాన్సర్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ లక్షణాలను కలిగి ఉంటుంది.

Spread the love