Tuesday, June 23, 2026
E-PAPER
Homeజాతీయంప్రార్థనలపై వీహెచ్‌‌పీ దాడి

ప్రార్థనలపై వీహెచ్‌‌పీ దాడి

- Advertisement -

మతమార్పిడులంటూ ఆరోపణలు
బెంగాల్‌లో ఆగని మైనార్టీలపై దాడులు
రాణిగంజ్ :
బిజెపి ప్రభుత్వ బెంగాల్‌‌లో అధికారంలోకి వచ్చిన అనంతరం మైనార్టీలపై దాడులు, వేదింపులు పెరిగాయి. తాజాగా పశ్చిమ బర్ధమాన్ జిల్లా రాణిగంజ్‌లో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒక క్రైస్తవ ప్రార్థనా సమావేశంపై విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌‌పి) సభ్యులు దాడికి పాల్పడ్డారు. మహిళలను ప్రలోభపెడుతున్నారని, బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారంటూ ఆరోపిస్తూ ప్రార్థనలు చేసుకుంటున్న విశ్వాసులపై మూక దాడికి పాల్పడ్డారు.
ఏం జరిగిందంటే?
ఆదివారం రాణిగంజ్‌లో క్రైస్తవ ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ సమయంలో విహెచ్‌‌పి , బజరంగ్ దళ్ కార్యకర్తలు ఒక్కసారిగా చొరబడ్డారు. ప్రార్థన చేస్తున్న వారి నుంచి బైబిళ్లను లాక్కుని, అక్కడ ఉన్న వారిపై దాడికి దిగారు. ‘‘ఈ బైబిల్ సహాయంతో మా మతం మహిళలను ప్రలోభపెట్టి క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారు. ఇలాంటి చర్యలను విహెచ్‌‌పి, బజరంగ్ దళ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించవు’’ అని దాడి చేశారు. ఈ క్రమంలో వారు పెద్ద పెట్టున మతపరమైన నినాదాలు చేశారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో పోలీసు అధికారులు కూడా అక్కడే ఉండటం గమనార్హం. అక్కడ ఉన్న మహిళలు తాము ఎవరి ఒత్తిడి లేకుండా, తమ స్వచ్ఛంద నిర్ణయంతోనే మతం మారామని, ఇందులో ఎటువంటి మోసం లేదని పోలీసులకు మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ, దాడి చేసిన వారు వారిని బెదిరించారు. సుమారు 25 మందిని బలవంతంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే, ఈ ఘటనపై పశ్చిమ బర్ధమాన్ పోలీసులు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం మతమార్పిడి నిరోధక చట్టం అమలులో లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించి భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఘటనలు వరుసగా చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనను ప్రముఖ జర్నలిస్ట్ అర్ఫా ఖానుమ్ షేర్వానీ తీవ్రంగా ఖండించారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసుల విధులను మతోన్మాద, జాతీయవాద కార్యకర్తలు తమ చేతుల్లోకి తీసుకోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మైనారిటీల భద్రతపై ఆమె ప్రశ్నలు . సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో, మత స్వేచ్ఛ, చట్టవిరుద్ధమైన జోక్యంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను కాపాడాలని ప్రతిపక్ష నేతలు, మానవ హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -