స్వచ్ఛ బాటలో పల్లెలు

Village on the clean path– నేటి నుండి స్వేచ్ఛాత హీ సేవ కార్యక్రమాలు
– జిల్లాలో 868 గ్రామపంచాయతీ 
– 12.23 లక్షల జనాభా
– మొదటిరోజు అమ్మకోసం మొక్క కార్యక్రమం 
– మంత్రి కోమటిరెడ్డి చేత ప్రారంభించాలని అధికారుల సన్నాహాలు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు.. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం ప్రగతి సాధిస్తుంది. అవి ఆరోగ్యంగా ఉంటేనే దేశం కూడా సౌభాగ్యంగా ఉంటుందనే మహాత్ముడి కలలను నిజం చేసేందుకు ప్రధాని మోదీ స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో గతే డాది స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈనెల 17 నుంచి అక్టోబరు 2 వరకు గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. నల్లగొండ జిల్లాల్లో మంగళవారం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. పల్లెల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచి స్వచ్ఛ గ్రామాలుగా మార్చాలనే సంకల్పంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి. కార్యక్రమంలో మొదటిది అమ్మ కోసం మొక్కను నాటే కార్యక్రమం.ఈ కార్యక్రమాన్ని నేడు రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేత ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
వ్యాధుల కట్టడికి అవకాశం..
గ్రామాల్లో పారిశుద్ధ్యం బాగుంటేనే ప్రజలు ఆరో గ్యంగా ఉంటారు. అది లోపిస్తే జనం అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో డెంగీ, మలేరియా, విషజ్య రాలు విజృంభించి ప్రజలు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హే సేవ కార్యక్రమంతో మేలు జరిగే అవకాశం ఉంది. దీన్ని విజయవంతం చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. కాగా నల్లగొండ జిల్లాలో 868 గ్రామపంచాయతీలు ఉండగా 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 12.23 లక్షలకు పైగా గ్రామీణ జనాభా ఉంది.
మూడు శాఖలు కలిసి..
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా పంచాయతీ, జిల్లా పరిషత్ కార్యాలయ మూడు కలిసి పనిచేస్తాయి. డిఆర్డిఏ పిడి, జిల్లా పరిషత్ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారి ముగ్గురు అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం, కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు.
రోజువారిగా కార్యక్రమాలు..
17న గ్రామాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో వనమహోత్సవం కార్యక్రమం. కార్యక్రమంలో భాగంగా అమ్మకోసం మొక్క నాటడం ఉంటుంది. అదేవిధంగా మరుగుదొడ్ల మంజూరు, కమ్యూనిటీ. శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణాల ప్రారంభం.
– 18న పాఠశాలల్లో పారిశుద్ధ్యంపై అవగాహన విద్యార్థులకు పోటీల నిర్వహణ.
– 19న పాఠశాలలు, అంగన్వాడీలు, ఆరోగ్య కేంద్రాలు, పబ్లిక్ ప్రదేశాల్లో శ్రమదానం.
– 20న ఇంటింటికి వెళ్లి దోమల నివారణ చర్యలు చేపట్టాలి. గుర్తించిన గృహాల్లో మరుగుదొడ్ల
నిర్మాణాలు ప్రారంభించాలి.
– 21న నీటి క్లోరినేషన్, మంచినీటి ట్యాంకులు శుభ్రపరచడం వంటివి చేపట్టాలి.
– 23న స్వచ్ఛ సాంస్కృతిక కార్యక్రమాలు.
– 24న గ్రామాల్లోని మురుగు కాలువల్లో చెత్త తొలగింపు, కమ్యూనిటీ ఇంకుడుగుం తల నిర్మాణాల ప్రారంభం.
– 25న తడి, పొడి చెత్తపై అవగాహన.
– 26న గ్రామ పరిసరాల్లో శ్రమదానం.
– 27న ఇంటింటికి వెళ్లి ఫాగింగ్, బ్లీచింగ్ చల్లే కార్యక్రమాలు.
– 28న ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన. దుకాణ యజమానులతో సమావేశం, పర్యావరణ హిత వస్తువుల ప్రదర్శన, మహిళా ఆరోగ్యం, ఎంహెచ్ఎంపై అవగాహన, ఎస్ యు పి పైన హోటల్లకు నోటీసుల జారీ, స్టీలు గ్లాసులు, ప్లేట్లు వాడేటట్టు అవగాహన.
– 30న అన్ని మండల కేంద్రాలు, ఉపకేంద్రాల్లో పారి శుద్ధ్య సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు, మందుల పంపిణీ.
– అక్టోబరు1న అన్ని మండల కేంద్రాలు, సబ్ సెంటర్లో సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు, మందులు పంపిణీ. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలి.
– 2న గ్రామసభల ఏర్పాటు, మహా త్మాగాంధీ జయంతి ఉత్సవాలు, స్వచ్ఛ భారత్ దినోత్సవం, స్వచ్ఛత ప్రతిజ్ఞ, బహుమతుల ప్రదానోత్సవం, పారి శుద్ధ్య సిబ్బందికి సన్మానం, బీమా పత్రాలు, పీపీఈ కిట్లు పంపిణీ.
ఏర్పాట్లు పూర్తి.. ఎ.శేఖర్ రెడ్డి (డిఆర్డిఏ పిడి)
జిల్లాలోని అన్ని గ్రామాలలో మంగళవారం నుండి స్వేచ్ఛత హీ సేవ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేశాం. ప్రతి గ్రామంలోనూ రోజువారి కార్యక్రమాలను నిర్వహించి వివరాలను నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమాలలో ఆరు కార్యక్రమాలు అతి ముఖ్యమైనవి. అందులో మొదటిది అమ్మ కోసం మొక్క నాటడం. ఈ కార్యక్రమల నిర్వహణపై కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. మండలాలలో ఎంపీడీవోలు కార్యక్రమాన్ని పర్యవేక్షించేలా మార్గదర్శకాలు విడుదల చేశాం.
Spread the love