గ్రామ కార్యదర్శిలు సమయపాలన పాటిస్తూ రికార్డులను పూర్తి చేయాలి..

నవతెలంగాణ- రెంజల్

గ్రామ కార్యదర్శులు తమ విధులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సమయపాలన పాటించాలని ఎంపీడీవో శంకర్, ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్ లు స్పష్టం చేశారు. బుధవారం రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో గ్రామ కార్యదర్శులు ఆయా గ్రామాలలో అందుబాటులో ఉండాలని వారు సూచించారు. ప్రతి గ్రామపంచాయతీలలో తమ పంచాయతీ నిధులను దృష్టిలో పెట్టుకొని ఈఎంఐ, కరెంట్ బిల్లులను సక్రమంగా చెల్లించుకోవాలని సూచించారు. పంచాయతీలకు సంబంధించిన రికార్డులను పూర్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ శ్రీనివాస్, గ్రామ కార్యదర్శులు రాజేందర్రావు, రాఘవేందర్ గౌడ్, శ్రీకాంత్, సుమన్, సిహెచ్ సాయిలు, కృష్ణ, సాయిబాబా, సునీల్, మహబూబ్ అలీ, నవీన్, రాజు, రోజా, రాణి ,గౌతమి, అమ్రీన్, రజిత, తదితరులు పాల్గొన్నారు.
Spread the love