గ్రామ గ్రామాన కాంగ్రెస్ బైక్ ర్యాలీ

– బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్..
-భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 
– గ్రామాల్లో భారీ స్పందన..
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డి పేట మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ  పోచారం గ్రామం నుండి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రారంభించారు. పోచారం మీదుగా వదలపర్తి, మాల్ తుమ్మెద, గోలి లింగాల్, చినూరు, వాడి గ్రామాల మీదుగా మండల కేంద్రం నుండి బంజారా లింగంపల్లి తో పాటు బొల్లారం వరకు బైక్ ర్యాలీ కొనసాగింది.  గ్రామాల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్మోహన్ రావ్ మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలిచిందని కేవలం మెజారిటీ కోసమే బైక్ ర్యాలీ, ప్రచారం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు గ్రామాల్లోపల కాంగ్రెస్ ప్రచారం నిర్వహిస్తే విశేష స్పందన వస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, వాసు రెడ్డి, విట్టల్ రెడ్డి,  పర్వత్రావు , షాహిద్ పాష, ఠాగూర్, దివిటీ కిష్టయ్య, ఇమామ్, విక్రమ్, గులాం హుస్సేన్, సాయ గౌడ్, సుధాకర్, కిరణ్, సంజీవులు, సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love