పచ్చదనం…పరిశుభ్రతతో సరికొత్తగా గ్రామాలు

– ఎస్ కృష్ణ ఆదిత్య ములుగు జిల్లా కలెక్టర్
నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన ట్రాక్టర్ ద్వారా మెరుగైన పారిశుద్ధ్యం. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్న నర్సరీ, పల్లె ప్రకృతి వనం. ప్రజా భాగస్వామ్యంతో పల్లెల్లో మరింత అభివృద్ధి సాధ్యం. పల్లె ప్రగతి కార్యక్రమంతో పచ్చదనం… పరిశుభ్రతతో సరికొత్తగా గ్రామాలు కనబడుతున్నాయని జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా  మండలం లోని బుస్సాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం  తెలంగాణపల్లె ప్రగతి దినోత్సవంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో  జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, ఎంపీపీ శ్రీనివాస్  రెడ్డి, జెడ్పిటిసి హరిబాబు, గ్రంథాలయ చైర్మన్ గోవింద్ నాయక్ లతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రగతి బాటలో బుస్తాపూర్ గ్రామపంచాయతీ పయనిస్తుందని అన్నారు. గ్రామపంచాయతీలో  ట్రాక్టర్ ,ట్రాలీ , ట్యాంకర్లను కొనుగోలు చేసి తడి, పొడి చెత్త వేరువేరు చేయడం ద్వారా 7 వేల 500 ఆదాయం సమకూర్చడం జరిగింది. గ్రామంలో 2 లక్షల 80 వేలతో డంపింగ్ యార్డ్, 9 లక్షల 59 వేలతో  స్మశానవాటిక, 2 లక్షల 15 వేలతో నర్సరీ, 1లక్ష 95 వేలతో  పల్లె ప్రకృతి వనం, 55 లక్షల తో 1100 మీటర్ల సిమెంట్ రొడ్డు నిర్మించడం జరిగింది.  గ్రామపంచాయతీలో మిషన్ భగీరథ కింద ఇంటింటికి పరిశుభ్రమైన మంచినీరు సరఫరా చేస్తున్నాం,  పల్లె ప్రగతి కార్యక్రమం కింద గ్రామానికి ప్రభుత్వం నుంచి 22 లక్షల 7 వేల నిధులు అందగా, వాటిని గ్రామాభివృద్ధికి వినియోగించడం జరిగింది. బుస్సాపూర్ గ్రామాల్లోకి వచ్చేటప్పుడు రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు స్వాగతం పలికాయని, హరితహారం కార్యక్రమం లో నాటిన మొక్కలను చాలా బాగా సంరక్షిస్తున్నారాని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డిశ్రీనివాస రెడ్డి, జెడ్పిటిసి హరిబాబు, గ్రంథాలయ చైర్మన్ గోవింద్ నాయక్ లు మాట్లాడుతూ  ప్రతి గ్రామంలో ట్రాక్టర్, స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్ ,నర్సరీ, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, దేశంలో మరే రాష్ట్రంలో గ్రామాలలో ఇలాంటి వసతులు లేవని  తెలిపారు. అడిగితే గాని అమ్మ కూడా భోజనం పెట్టదని సామెత ఉందని, కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అడగాకుండానే అన్ని పథకాలు ప్రవేశ పెట్టారని అన్నారు.అనంతరం గ్రామపంచాయతీ పరిశుద్ధ సిబ్బందికి శాలువతో సత్కరించి 2 జతల దుస్తువు లను కలెక్టర్, ప్రజా ప్రతినిధులు అందజేశారు. అనంతరం  జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, ఎంపీపీ శ్రీనివాస్  రెడ్డి, జెడ్పిటిసి హరిబాబు, గ్రంథాలయ చైర్మన్ గోవింద్ నాయక్ లతో కలసి గోవిందరావుపేట్ మండలంలోని మచ్ఛపూర్ లో 20 లక్షల అంచనా వ్యయంతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనుల శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో డీఈవో పానిని, కో ఆప్షన్ మేంబర్ బాబర్, ఎంపిటిసి చాపల ఉమదేవి,  తాహాసిల్దార్ రాజ్ కుమార్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, బుస్సాపూర్ సర్పంచ్ శ్రీలత చంద్రయ్య  మచ్చాపూర్ సర్పంచ్ రవీందర్ రెడ్డి, బుస్తాపూర్,  మచ్చాపూర్ గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు,  గ్రామపంచాయతీ సిబ్బంది, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love