ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్లను తక్షణమే నియమించాలని వినతి: ఈసంపల్లి సైదులు

నవతెలంగాణ – నెల్లికుదురు 
ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజలను తక్షణమే నియమించి స్కావెంజర్లలను ఆదుకోవాలని ఎంపీడీఓ బాలరాజుకు వినతి పత్రాన్ని అందించినట్లు తెలంగాణ స్కావెంజర్ల సంగం మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు ఈసంపల్లి సైదులు తెలిపాడు. మండల కేంద్రంలోని సమావేశ మందిరంలో శనివారం స్కావెంజర్ల తో కలిసి  సమస్యను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులను కల్పించడమే ప్రభుత్వం ముందుకు పోతున్న క్రమంలో మా సమస్యను కూడా పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్లను నియమించాలని, గ్రామ పంచాయతీలకు అప్పగించే విధానాన్ని రద్దు చేయాలి అని అన్నారు.  లక్షలు ఖర్చుపెట్టిన పాఠశాల పరిశుభ్రత చేయుటకు సిబ్బంది లేకపోయినా, వెచ్చించిన బడ్జెట్ వృధా కావడమే తప్ప ఫలితం లేదని అన్నారు. పరిశుభ్రత లోపించినట్లయితే ఆ పాఠశాలలో ఎన్నో రకాలైన జబ్బులకు దారితీసే అవకాశాలు ఉన్నాయని, మరియు పిల్లలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటుందని అన్నారు.  గత 2015 సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో మరుగుదొడ్ల  పరిశుభ్రత పాఠశాల పరిశుభ్రత చెట్ల పెంపకం పాఠశాల ఆవరణమంతా పరిశుభ్రత క్లాస్ రూమ్ లో శుభ్రత ముత్రశాలల పరిశుభ్రత అనేక రకాల పనులు చేయుటకు 2015 సంవత్సరంలో నుండి 2020 వరకు అతి తక్కువ వేతనంతో ఐదు సంవత్సరాలు కాలం పాఠశాలలో పనిచేయడం జరిగింది అని తెలిపారు. కరోనా కష్టకాలంలో లాక్ డౌన్ పేరుతో గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో పని చేసే స్కావెంజర్లను తొలగించి గ్రామపంచాయతీలకు అప్పగించడం వలన వారు పాఠశాలలో పరిశుభ్రత చేయుటకు వారి పనులు వారికే అతిగా ఉండటం వలన వారు చేయలేకపోయారు. గత ఐదు సంవత్సరాల కాలం పాటు పాఠశాలలైన నమ్ముకొని అది తక్కువ వేతనంతో పనిచేసిన స్కావెంజర్లను ఐదు సంవత్సరాల కాలం పాటు వాడుకుని గత ప్రభుత్వం తొలగించడం వలన దానిమీద ఆధారపడిన కుటుంబాలు బజారున పడి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని, భవిష్యత్తులో పాఠశాల పున ప్రారంభం జరుగుతున్న కార్యక్రమంలో  బాగంగా తిరిగి  వారిని తీసుకోవాలని, వారికి తగిన కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ఎన్నికల్లో ఇప్పుడున్న ప్రభుత్వం పాఠశాలల్లో పరిశుద్ధ కార్మికులను నియమిస్తామని హామీ ఇవ్వడం వలన కొంత ఊరట ఇచ్చిందని దానిని తక్షణమే అమలు చేసి పాఠశాలల ప్రారంభం ముందే వారిని నియమకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ వెంకన్న ఐలమ్మ తదితరులు పాల్గొన్నారు.
Spread the love