
ట్రాఫిక్ నియమాలు అని చెప్తే కఠిన చర్యలు తప్పవనీ పసర ఎస్ ఐ ఏ కమలాకర్ అన్నారు. శనివారం మండల పరిధిలో జాతీయ రహదారిపై వాహన తనిఖీ మరియు డ్రంక్ అండ్ పరీక్షలు ఎస్ఐ కమలాకర్ నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై కౌన్సిలింగ్ ఇచ్చారు. జాతీయ రహదారిపై ఇసుక లారీలు రోడ్డుకు ఇరువైవుల అనుమతి లేకుండా నిలిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధిక లోడు తో వెళ్లిన, రోడ్డు నియమాలు పాటించకుండా అతి వేగం తో వాహనాలు నడిపిన ఉపేక్షించమన్నారు.ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని అన్నారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలని నిబంధనలతో విరుద్ధంగా నడుచుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నిలపరాదని డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల లో దొరికితే శిక్షలు తప్పవనీ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.