సమస్యలు పరిష్కరించాలని వీవోఏల ధర్నా

నవతెలంగాణ-మహాబూబాబాద్‌
ఐకేపీ వీవోల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఆర్డిఓ ఆఫీస్‌ ముందు ధర్నా నిర్వహించి ఆర్డీవో కొమురయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా కష్ణవేణి అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో సమ్మట రాజ మౌళి, కుమ్మరి కుంట్ల నాగన్నలు మాట్లాడారు. అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనంఇచ్చి వెట్టిచాకిరి చేయించుకోవడం జరుగుతుందన్నారు. వీవోఏలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గౌరవ వేతనం వద్దని కనీస వేతనం ఇవ్వాలని సరిపోతుందో గుర్తించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ప్రతి ఐకేపీ వీ వోకు రూ.10లక్షల బీమా చేయించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పనివారం తగ్గించాలని కోరారు.తక్షణమే వీవోఏలను పిలిచిరాష్ట్ర ప్రభుత్వం వారి తో చర్చించాలని, లేనియెడల పెద్దఎత్తున జనసమీకరణ చేసి అసెంబ్లీని ముట్టడి చేస్తామని వారుహెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లలిత, వసంతకుమారి, శ్రీల త, వీరన్న, అరుణ, శ్రీలత, అక్బర, మీనాక్షిలు పాల్గొన్నారు.
తొర్రూరు : ఐకెేపీ వీవోఏలకు కనీస వేతన చట్టం అమలు చేసి జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని,వీవోఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వీవోఏల సంఘం (సీఐటీయు అనుబంధం) జిల్లా కన్వీనర్‌ చింత మౌనిక, వివోఏ ల సంఘం జిల్లా నాయకులు చిల్ల నిరంజన్‌, సీఐటీయు జిల్లా కమిటీ సభ్యులు ఇసంపల్లి సైదులు, జమ్ముల శ్రీనివాస్‌లు డిమాండ్‌ చేశారు. గురువారం తొర్రూరు డివిజన్‌ పరిధిలోని ఐదు మండలాల ఐకెపి, వీవోఏల సమస్యలను పరిష్కరించాలని డివిజన్‌ కేంద్రంలోని అంబేద్కర్‌ సెంటర్‌ నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు నెల్లికుదురు, నరసింహుల పేట, దంతాలపల్లి, మండలాల వివోఏలు ర్యాలీగా వెళ్లి ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. వివో ఏ లకు సంఘీభావం తెలపడానికి ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన సీపీఎం తొర్రూరు మండల కార్యదర్శి ఎండి.యాకూబ్‌ తో కలిసి చింత మౌనిక, చిల్ల నిరంజన్‌, ఇసంపల్లి సైదులు, జమ్ముల శ్రీనివాస్‌లు మాట్లాడుతూ ఐకేపీ వీవోఏలు గత 32 రోజుల నుండి మండుటెండల్లో 9 డిమాండ్లతో నిరవధిక సమ్మె నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెవు మీద పేను పారినట్లు కూడా లేదా..? అని ప్రశ్నించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని 32 రోజుల నుండి సమ్మె చేస్తున్నా మంత్రి గాని ఎమ్మెల్యే గాని స్పందించడం లేదని మహిళాభివద్ధి తెలంగాణలో చాలా గొప్పగా ఉందని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం మహిళల సమస్యలు పరిష్కరించడంలో మహిళా సంఘాలను బలోపేతం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతుందని విమర్శించారు. వీవోఏల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణిని వీడి చర్చలకు పిలిచి సమ్మెను విరమింప చేయాలని అలా స్పందించని పక్షంలో అన్ని ప్రజా సంఘాలను, కార్మిక సంఘాలను, అన్ని ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ప్రగతి భవన్‌ ముట్టడి కార్యక్రమం నిర్వహించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తొర్రూరు పరిధిలో ఉన్న ఐదు మండలాల వీవోఏలు తమ సమస్యలపై అందరూ సంఘటితంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని పెద్దవంగర, తొర్రూరు మండలాల వీవోఎ లు కూడా కలిసి పనిచేయాలన్నారు. పెద్దవంగర, తొర్రూరు మండలాల వీవోఏలకు కూడా జరిపే కార్యక్రమ వివరాలు తెలియజేస్తున్నామని అయినా కూడా పెద్దవంగర, తొర్రూరు మండలాల వివోఏలు ఏ కార్యక్రమంలో పాల్గొనడం లేదని… పెద్ద వంగర, తొర్రూరు మండలాల వీవోఏలు ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా ఎవరి బెదిరింపులకు భయపడకుండా మన హక్కులను మనం సాధించుకోవడానికి సంఘటితంగా ముందుకు రావాలని వీవోఏల సంఘం జిల్లా కన్వీనర్‌ చింత మౌనిక కోరారు. మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా సీఐటీియు మరియు ప్రతిపక్ష పార్టీలన్నీ మనకు అండగా ఉన్నాయని ఎవరి ఒత్తిళ్లకు లొంగవద్దని పెద్ద వంగర, తొర్రూర్‌ మండలాల వీవోఏలకు సూచించారు. వినతిపత్రం అందుకున్న ఆర్డీవో
రమేష్‌ బాబు మాట్లాడుతూ మీ సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజే స్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా నాయకులు మార్క సాంబయ్య, తిమ్మిడి రవి, ఐకెేపీ వీవోఏల సంఘం నాయకులు హనుమంత్‌, రాధిక, రమ, మంజుల, రమేష్‌, గడ్డల రాము, ఇందిరా, కవిత, విజయలక్ష్మి, సోమశేఖర్‌, వెంకన్న, టి.రజిత, రమ, విజయ, తదితర వీవోఏలు పాల్గొన్నారు.

Spread the love