ఓటు ఆటో.. ఇటో..?

– ఆరా తీస్తున్న పార్టీలు
– లెక్కలేస్తున్న వర్గాలు
నవ తెలంగాణ- మల్హర్ రావు: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలై ఈ నెల30న ఓటింగ్  జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రధాన  పార్టీల అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు వలసల పర్వం కొనసాగుతోంది. కొందరు ఉదయం ఒక కండువా సాయంత్రం మరో కండువా మారుస్తున్న నేపథ్యంలో ఎవరిని నమ్మోలో, ఎవర్ని నమ్మొద్దో తెలియక ద్వితీయ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఛోటామోట నాయకులు పూటకో కండువా మారుస్తున్న నేపథ్యంలో ఓటు ఆటా.. ఇటాని ప్రధాన పార్టీల అభ్యర్థుల అనుచరులు తాయిలాలు అవుతున్నారు. వర్గాల వారీగా మాత్రం అంచనాలు వేసుకొంటున్నారు. గ్రామాల్లో ఇలా ముచ్చట్లు హలో కొమురన్న నమస్తే బాగున్నావే. ఎట్లున్నది మనోళ్లు అంతా మనదిక్కే ఉన్నరు కదనే. ఇంతకు మన కులపొల్లు ఎంతమంది ఉంటరే. ఈ ఊళ్ళో ఎయె కులపొల్లు ఎంతమంది ఉంటరే కొమురన్న జెర జెప్పు. అందరూ ఏమంటున్నారో జర అరుసుకోయే అంటూ పల్లెల్లో ఉండే క్రియాశీలక కార్యకర్తలు, నాయకులకు, అభ్యర్థుల అనుచరుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఈ మేరకు గ్రామాల్లో సదరు నాయకులు కులాలు, సంఘాల వారిగా లెక్కలు తీసి అందులో ఎవరెవరూ మాట్లాడుతున్నారు ఏ పార్టీ దిక్కు తిరుగుతున్నారు. అనే విషయాల నుంచి అన్ని వివరాలను సేకరించి తిరిగి వారికి చెబుతున్నారు. ఇలా వచ్చిన లెక్కల ప్రకారం అభ్యర్థులు ఓట్లు రాబట్టుకునేందుకు ఎం చేయాలో అంచనాలు వేసుకుంటున్నారు. ఎవరికి తాయిలాలు పంపిణీ చేయాలి, ఎప్పటి నుంచి ఇవ్వాలి, ఎవరితో పంపించాలనే లెక్కలు వేస్తున్నారు. కులాల వారిగా ప్రభావితమయ్యే ఓట్లపై నాయకులు ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Spread the love