
వీఆర్ఏలను క్రమబద్ధీకరించినందుకుగాను రుద్రంగి మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ఎన్నో సంవత్సరాలుగా గ్రామాలకు సేవ చేస్తున్న వీఆర్ఏలను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ తీసుకున్న నిర్ణయానికి గాను వీఆర్ఏలమంతా హర్షం వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు. అందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియ జేశారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు రాణవేణి తిరుపతి, సురేష్, గంగాధర్, భూమయ్య, రాజలింగం,తదితరులు పాల్గొన్నారు.