Tuesday, May 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాంట్రాక్ట్, ఔ‌ట్‌ సోర్సింగ్‌ఉద్యోగుల వేతనాలు పెంచాలి

కాంట్రాక్ట్, ఔ‌ట్‌ సోర్సింగ్‌ఉద్యోగుల వేతనాలు పెంచాలి

- Advertisement -


తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్
కోఠిలోని డీఎంఈ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ -సుల్తాన్ బజార్

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్, పేషంట్ కేర్, స్వీపర్ ఇతర కాంట్రాక్ట్, ఔట్‌ ‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు పెంచాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్ డిమాండ్ చేశారు. వీరంతా ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలే, తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో పని చేస్తున్నారని తెలిపారు. సోమవారం యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ కోఠిలోని డీఎంఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల తరబడి కాంట్రాక్ట్ , ఔట్‌ ‌సోర్సింగ్‌ ‌పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం చెల్లించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని అన్నారు. వారందరికీ కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని కోరారు. ఔట్‌ ‌సోర్సింగ్ ఏజెన్సీలను రద్దుచేసి ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేసి వేతనాలు ఇవ్వాలని, పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని అన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని, పని ప్రదేశంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం వైద్య విద్య సంచాలకులు డా. నరేంద్ర కుమార్‌, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్‌ ‌డా. అజయ్‌ ‌కుమార్‌కు వినతిప్రతాలు అందజేశారు. అందుకు స్పందించిన అధికారులు.. 20 రోజుల్లో వేతనాల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఆలోపు వేతనాలు పెంచకపోతే దశలవారీ ఆందోళనలు, అవసరమైతే నిరవధిక సమ్మెకు ఉద్యోగులందరూ సిద్ధపడాలని యాదనాయక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి జె.సుధాకర్, రమేష్, ప్రకాష్, దేవిదాస్, సుమన్, కర్నాకర్‌, రాజు, కుమారస్వామి, విజయ సదానందం రమేష్ తిరుపతి, మైపాల్, జంపయ్య మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -