‘భూమాత’ కోసం ఎదురుచూపు?

ధరణి పోర్ట్టల్‌ రద్దు చేసి దాని స్థానంలో ‘భూమాత’ను తీసుకొ స్తామని కాంగ్రెస్‌ ప్రటించినట్లుగానే..ఆ దిశగా సమీక్షలు కొనసాగు తున్నట్లు తెలుస్తోంది. ఏండ్లుగా పేరుకు పోయిన ఫైళ్ల పరిష్కారం అంత తేలిక కాదనేది తెలిసిందే. దీనిపై రేవంత్‌ సర్కార్‌ తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ధరణిలో భూ సమస్యలు పరి ష్కారానికి నోచక రైతు ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. లక్షలాది మంది రైెతులు రెవెన్యూ, కలెక్టర్‌ ఆఫీసుల చుట్టూ తిరిగి వేసారి పోయారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అనేక ఆశలు పెట్టుకున్నారు భూ బాధిత రైతులు.
ధరణి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం దారులు వెతు కుతున్నట్లు ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్థమౌతుంది. అయితే..అవి ఎంత మేరకు ఫలిస్తాయనేని రానున్న కాలంలో తేలనుంది. ధరణిలో భూ సమస్యల పరిష్కారానికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, నిర్ల క్ష్యంపై సీఎం అధికారుల నుండి ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఇందు లో భాగంగా ఉన్నత స్థాయి సమావేశంలో పలు అంశాలు ప్రస్తావిం చినట్లుగా తెలుస్తుంది. సీసీఎల్‌ఏలో 2.31 లక్షల ఫిర్యాదులు పెం డింగ్‌లో ఉన్నట్లు సంబంధిత అధికారి నవీన్‌ మిట్టల్‌ ప్రకటించారు. లక్షలాది మంది బాధితులు ఆన్‌లైన్‌లో పలుమార్లు దరఖాస్తు చేసు కుని ఫీజు చెల్లించారు. వాటిని పరిష్కరించక పోగా.. తిరస్కరించిన సందర్భాలు కోకొల్లలు. రైతుల నుండి ఫీజుల రూపంలో వసూలు చేసిన ఆదాయం ఎక్కడికి వెళ్లిందనేది తెలియాల్సి ఉంది. దీంతో పాటు భూ భారతి కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 83 కోట్లు దేనికి ఖర్చు చేశారనేదానిపై సమాదానం రావాల్సి ఉంది.
సీఎం రేవంత్‌ రెడ్డి ప్రగతి భవన్‌లో నిర్వహించిన ప్రజా దర్భార్‌ కూ భూ సమస్యలే ఎక్కువగా వచ్చాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక.. భూ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎదురుచూస్తున్నారు రైతులు. ఆ దిశగా ప్రభుత్వ చర్యలపై సర్వత్రా చర్చ జరు గుతోంది. గ్రామ, మండల స్థాయిలో తహసీల్దార్‌ ఆఫీసుల చుట్టూ తిరిగే వేలాది మంది రైతులు ప్రభుత్వ నిర్ణ యం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకరి భూమి మరొకరికి, తప్పు గా సర్వే నెంబర్ల ముద్రణ, పట్టా భూమి ప్రభుత్వ భూమిగా, అసైన్డ్‌, భూ దాన్‌, ఎండోమెంట్‌, వక్ఫ్‌ భూ ములు.. ఇలా ధరణిలో వందలాది రకా లుగా తప్పులు నమోదయ్యాయి. ఆ సమస్యలు గత ప్రభుత్వంలో పరిష్కారానికి నోచుకోలేదు. ధరణి పోర్టల్‌కు ముందు.. ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్‌ జరిగినా… వాటి మ్యుటేషన్‌ను అడ్డుకునే అధి కారం తహసీల్దార్‌కు ఉండేది. కానీ, ధరణి వచ్చాక రికార్డులు సరిగ్గా ఉంటే తిరస్కరించడానికి వీల్లేదన్న నిబంధనతో ప్రభుత్వ భూముల మ్యుటేషన్‌ జరగకుండా అడ్డుకునే అవకాశం పోయింది. జారీ చేసిన పాస్‌పుస్తకం రద్దు చేయాలని ఎవరైనా ఆర్డీవోకు, జాయింట్‌ కలెక్టర్‌కు గతంలో నివేదించే అవకాశం ఉండగా… ధరణిలో ఆ అవకాశమే లేదు. ధరణి పోర్టల్‌లో కాస్తు కాలంతో పాటు పలు అంశాలు లేకుండా పోయాయి. వీటిని పరిగణలోకి తీసుకుని..రైతులకు మేలు చేస్తామని ప్రస్తుత ప్రభుత్వం చెబుతున్నా..కార్యచరణలో సాధ్యసాధ్యాలపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
భూ సమగ్ర సర్వే చేపట్టి కొత్తగా ఆన్‌లైన్‌లో రికార్డు నమోదు అందజేసి రైతులకు పాసు పుస్తకాలు అందజేయాలనే డిమాండ్‌ ఉంది. సర్వే నెంబర్‌, గ్రామం యూనిట్‌గా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టా లనే సూచనలు చేస్తున్నారు. అయితే..ఈ ప్రక్రియ పూర్తికి కనీసం ఏడాదికాలం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబు తున్నారు. అప్పటివరకు ధరణి పోర్టల్‌లోనే సమస్యలు పరిష్కరిస్తారా.. లేక భూమాత పోర్టల్‌ వచ్చాకే పరిష్కారం అవుతాయా.. అనేది ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది.
– చిలగాని జనార్ధన్‌, 8121938106

Spread the love