Sunday, August 2, 2026
E-PAPER
Homeకవితమేలుకొలుపు పాటలు

మేలుకొలుపు పాటలు

- Advertisement -

భజన, భజంత్రీలు ఆపండ్రో
ఘనత కెక్కిన రాజ్యంరో ,ఇది నా తెలుగు నేలరో!
హామీల ఆంధ్రారో, ఉప్పు, పప్పుల నా తెలంగాణారో!
బనకచర్ల అంట, హంద్రీ నీవా అంట నిత్యం నీళ్లంట్రో!
తుంగ – భద్ర అంట, ముగ్గురు ముఖ్య మంత్రుల భేటీ అంట్రో!!
అయినా బావురు మంటుండ్రో రాజ్యంలో, అవురావురంటుండ్రో!
కరువు కాలంలో ఆకలి దప్పులు తీరేదేట్రో!
బుక్కెడు బువ్వా లేదు, గుక్కెడు నీళ్ళూ లేవు గందా!
ఏం చెయ్యమంటవ్‌, ఏం పెట్ట మంటవ్‌రో కొడకా!
అదేంటో ఎండా వానా రెండూ నంట్రో!
ఇదేంద్రో నేడు, వాగు వంకలు వెల వెల బోయెన్రో!
కష్ట కాలంలో మరి బీదా బిక్కికి డొక్క నిండేదెట్రో!
భజన, భజంత్రీ లాపండ్రో, నామాలోడి హుండీ తీయండ్రో!!
నామాలోడి హుండీ తీయండ్రో…
నామాలోడి.. నామాలోడి.. హుండీ.. తీయండ్రో!!

– బోడపాటి అప్పారావు, 9381509814

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -