– మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్
– అమెరికా నుంచి ట్వీట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘మేమంతా హరీశ్‌రావు వెంట ఉంటాం. మైనంపల్లి వ్యాఖ్యలను ఖండిస్తున్నా’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈ మేరకు సోమవారం అమెరికా నుంచి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘తన కుటుంబ సభ్యునికి టికెట్ నిరాకరించిన మన ఎమ్మెల్యే ఒకరు మంత్రి హరీష్‌రావుపై కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. మేమంతా హరీశ్‌రావు వెంట ఉంటాం.పార్టీ ఆవిర్భావం నుంచి హరీశ్‌రావు ఉన్నారు. ఆయన బీఆర్‌ఎస్ మూలస్తంభంగా కొనసాగుతారు’ అని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
మరో రూపంలో అవకాశమిస్తాం
క్రిశాంక్ సహా పలువురికి మరో రూపంలో అవకాశమిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తనను మళ్లీ సిరిసిల్ల నియో జకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేట్ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కతజ్ఞతలు తెలుపుతున్నట్టు కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నా రు. ఇక ప్రజా జీవితంలో నిరాశ, నిస్పహాలు ఎదురవుతాయని, సామర్థ్యం కలిగిన కొంత మంది నాయకులకు టికెట్లు లభించలేదన్నా రు. క్రిశాంక్‌తో పాటు అలాంటి కొంత మంది నాయకులకు అవకాశం రాలేదని, వీరందరికి ప్రజలకు సేవ చేసేందుకు మరొక రూపంలో అవకాశం ఇస్తామని కేటీఆర్ ప్రకటించారు.