
మేము ఓట్లు అమ్ముకోము టీ మాత్రమే అమ్ముకుంటాము అంటూ అవగాహన కల్పించారు డిఆర్డిఓ మరియు డిపిఓ శ్రీనివాస్ . మంగళవారం మండలంలోని పసర గ్రామంలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాన్ని ఎంపీడీవో జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు టి దుకాణాలు మరియు కూరగాయలు అమ్మే వారికి ఓటు ప్రాముఖ్యతను వివరించి మాట్లాడారు. అనంతరం వారి చేత మేము టీ మాత్రమే అమ్ముకుంటాము ఓట్లు అమ్ముకోము అని మేము కూరగాయలు మాత్రమే అమ్ముకుంటాము ఓట్లు అమ్ముకోము అంటూ ఫ్ల కార్డ్స్ తో అవగాహన కల్పిస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమం ఓటర్లను ఎంతగానో ఆకర్షించింది. అధికారుల పనితీరును ప్రజలు ప్రశంసించారు. ప్రతిసారి ప్రజలకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం మంచిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ సాజిదా బేగం, కార్యదర్శి శరత్ బాబు, ఈజీఎస్ ఏపీవో ప్రసూనారాణి పంచాయతీ సిబ్బంది చిరు వ్యాపారులు ఓటర్లు పాల్గొన్నారు.