నవతెలంగాణ – శాయంపేట: తహరాపూర్ గ్రామ సర్పంచ్ కుక్కల సరోజన తన కుమారుడు తిరుపతి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని గ్రామ ఉపసర్పంచ్ రావుల శ్రీనివాస్ వార్డ్ మెంబర్లు యెన్నం కనకా రెడ్డి, చందనాల సునీల్ తక్కల్ల రమ్యకృష్ణ కొమ్ముల అమృత తెలిపారు. వారు విలేకరులతో మాట్లాడుతూ మొన్న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి బలపరిచిన అభ్యర్థులుగా గెలుపొందామని తెలిపారు. ఏప్రిల్ రెండవ తేదీ సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ జరిగినట్లు తెలిపారు. సమావేశంలో గ్రామాభివృద్ధి గురించి చర్చ జరుగుతుంటే సర్పంచ్ సరోజన కుమారుడు అల్లుడు కొంతమంది మహిళ వార్డు సభ్యుల భర్తలు జోక్యం చేసుకోవడంతో సమావేశం గందరగోళంగా మారిందని పేర్కొన్నారు. చర్చ జరుగుతున్న సమయంలో గొడవ చేయవద్దని మర్యాదపూర్వకంగా బయటకు పోండి చర్చ అనంతరం మీకు తెలియజేస్తాం అని చెప్పడం జరిగిందని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సర్పంచ్ కుమారుడు అసహనం వ్యక్తం చేస్తు, గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచికి తప్ప ఎవరికి కూర్చోవడానికి కుర్చీలు ఉండకూడదని సెక్రటరీ అజయ్ కి చెప్పి కుర్చీలు తీసి వేయించారని ఆరోపించారు. చందనాల సునీల్ ను టార్గెట్ చేసి పరుష పదజాలంతో దూషిస్తూ అతనిపై దాడి చేశారని తెలిపారు. ఈ విషయంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. వారు తప్పుడు పనులు చేస్తూ వాటిని కప్పిపుచ్చుకోవడానికి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఉప సర్పంచ్ వార్డు సభ్యులు అంటే వారికి గౌరవం లేదని అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సర్పంచ్ తో మేము ఎలాంటి సంతకాలు చేయించలేదని అన్నారు. ఆమెను సర్పంచ్ పదవి నుండి తొలగించాలని దురుద్దేశం మాకు లేదని స్పష్టం చేశారు. ఆమెకు చదువు రాదని హేళన చేసిన
అసత్యపు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



