వీఆర్ఏ కుటుంబాలకు న్యాయం చేస్తాం :
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో 61 సంవత్సరాలు నిండిన వీఆర్‌ఏ వారసులకు న్యాయం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో సీపీఐ సభ్యులు నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. జీవో నెంబర్ 81 ప్రకారం మిగిలిన 3,797 మంది వీఆర్‌ఏ వారసులను ఉద్యోగంలోకి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కొన్ని న్యాయపరమైన చిక్కులు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని సభకు వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా రాష్ర్టంలోని నిరుపేద కుటుంబాలకు నీడ కల్పిస్తున్నట్టు పొంగులేటి తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు మహేశ్‌కుమార్ గౌడ్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ రాష్ర్టంలోని రూరల్ ఏరియాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం ఫేజ్-1 కింద 4.5 లక్షలు, ఫేజ్-2 కింద 2.5 లక్షలు మంజూరు చేసినట్టు సభకు తెలిపారు. ప్రతి నియోజక వర్గానికి రెండు విడతల్లో 5,500 ఇండ్లను అందించనున్నట్టు తెలిపారు. అర్భన్ ఏరియాల్లో మొదటి సారీగా హైదరాబాద్‌లో లక్ష ఇండ్లను టవర్ల రూపంలో నిర్మించనున్నట్టు వెల్లడించారు. త్వరలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం మొదలగు కార్పొరేషన్లలో ఈ పథకాన్ని వర్తింప జేయనున్నట్టు తెలిపారు. దేశంలోని అనేక రాష్ర్టాలకు ఇండ్ల పథకాలకు ఆర్థిక సాయం అందిస్తున్న కేంద్రం తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపించిందని విమర్శించారు.
వీఆర్ఏ కుటుంబాలకు న్యాయం చేస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



