Saturday, September 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరామగుండం బీపీఎల్ భూములను వెనక్కి తీసుకుంటాం

రామగుండం బీపీఎల్ భూములను వెనక్కి తీసుకుంటాం

- Advertisement -


1800 ఎకరాల స్వాధీనానికి ప్రయత్నాలు : మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

రామగుండంలో బీపీఎల్ కు ఇచ్చిన 1800 ఎకరాలను తిరిగి తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు తెలిపారు. శుక్రవారం శాసనసభలో పలువురు సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్బంగా బీపీఎల్ ‌భూములపై కోర్టులో కేసు నడుస్తోందని తెలిపారు. ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ప్యూచర్‌ ‌సిటీని గ్లోబల్‌ ‌సిటీగా మార్చుతామన్నారు. హైదరబాద్‌- ‌బెంగళూరు హైవేని డిఫెన్స్‌ ‌కారిడార్‌‌గా మార్చనున్నట్టు వెల్లడించారు. రైజింగ్‌ ‌తెలంగాణలో వరంగల్‌‌కు ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్‌‌హెచ్‌ 163 ఇండస్ర్టీయల్‌ ‌కారిడార్‌పై తమ దృష్టి ఉందన్నారు. దావోస్‌‌లో రూ.2 లక్షల కోట్ల విలువ చేసే ఏడు ఎంఒయులు జరిగాయనీ, రైజింగ్‌ ‌సమ్మిట్‌‌లో రూ.3.82 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు నమోదయ్యాయని వివరించారు. మొత్తంగా రూ.5.8 లక్షల కోట్ల పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారనీ, అయితే వారి ఫైనాన్సీయల్‌ ‌క్లోజర్‌తో ఈ పెట్టుబడులు ముడిపడి ఉంటాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -