Saturday, September 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపైసా ఖర్చు లేకుండానే రూ. కోటి ఉచిత బీమా

పైసా ఖర్చు లేకుండానే రూ. కోటి ఉచిత బీమా

- Advertisement -

‎​రాష్ట్రంలో 12.91 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఎలాంటి ఆర్థిక భారం పడకుండానే రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు రూ. కోటి ఉచిత ప్రమాద బీమా అందిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శాసనమండలిలో సభ్యులు పింగిళి శ్రీపాల్‌‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ పథకం ద్వారా ‎రాష్ట్రంలో 12,91,046 మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుందని వెల్లడించారు.
ప్రభుత్వం ప్రతి నెలా బ్యాంకుల ద్వారా జీతాలు చెల్లిస్తున్నందున, బ్యాంకర్లతో చర్చించి వారి వ్యాపార పురోగతికి అనుగుణంగా ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. 16 ప్రముఖ బ్యాంకులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామనీ, ఈ మేరకు ఆర్థిక శాఖ జీవో నంబర్ 77 ను జారీ చేసిందని వివరించారు.
బ్యాంకులు అందించే శాలరీ, పెన్షన్ అకౌంట్ ప్యాకేజీల ఆధారంగా బీమా ప్రయోజనాలు వర్తిస్తాయని భట్టి తెలిపారు. విమాన ప్రమాదంలో మరణిస్తే రూ. 2.20 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు కవరేజ్ లభిస్తుందనీ, సాధారణ ప్రమాద మరణానికి కూడా కొన్ని కేటగిరీల్లో రూ. 1.50 కోట్ల కంటే ఎక్కువ బీమా అందుతుందని తెలిపారు.

​‎ బ్యాటరీ స్టోరేజ్‌‌కు స్పందన అంతంతే…
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విజిఎఫ్ ద్వారా మూడుసార్లు టెండర్లు పిలిచినా, బ్యాటరీ స్టోరేజ్ ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని బీజేపీ సభ్యులు మల్క కొంరయ్య అడిగిన ప్రశ్నకు సమాధానంగా భట్టి సభకు వివరించారు. భవిష్యత్‌‌లో సాంకేతికత పెరిగి బ్యాటరీ ధరలు తగ్గితే ఈ ప్రాజెక్టులు వేగవంతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో భూముల ధరలు ఎకరాకు రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పైగా ఉండటంతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు పెట్టుబడిదారులకు ఆర్థికంగా గిట్టుబాటు కావడం లేదని అన్నారు. పరిగి పరిసర ప్రాంతాల్లో ఉన్న పవన విద్యుత్ (విండ్ పవర్) అవకాశాలపై అధ్యయనం చేసి త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు.
కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తోందనీ, ఇటీవల కరీంనగర్‌లో ఒక ప్లాంట్‌కు శంకుస్థాపన చేసినట్టు గుర్తుచేశారు. మణుగూరు వద్ద సింగరేణి చేపట్టిన మిథేన్ గ్యాస్ ప్రాజెక్ట్ ఖర్చు ఎక్కువగా ఉండటంతో గిట్టుబాటు కాలేదనీ, అయితే కోల్ గ్యాసిఫికేషన్‌పై అధ్యయనం జరుపుతున్నామని తెలిపారు. దేవాదాయ, ప్రభుత్వ భూములను లీజుకు తీసుకుని, సెర్ప్ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు పీపీఏలు కుదుర్చుకున్నామని డిప్యూటీ సీఎం వెల్లడించారు.






- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -