డబుల్ బెడ్ రూమ్ ల అవినీతిపై సమగ్ర విచారణ జరిపిస్తాం..

– బోధన్ ఎమ్మెల్యే మాజీమంత్రి పి .సుదర్శన్ రెడ్డి..

నవతెలంగాణ- రెంజల్
మండలంలో నిరుపేదలకు మంజూరైన రెండు పడకల గదిలో నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని, త్వరలోనే ఉన్నత అధికారులతో విచారణ జరిపిస్తామని బోధనీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ప్రజాపాలన ఆన్లైన్ నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. పది రోజులుగా నిరుపేదలు ఆరు గ్యారెంటీ పథకాలపై దరఖాస్తులు చేసుకోగా, వాటిని ఆన్లైన్లో నమోదు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలపై ఏలాంటి భయాందోళనలనచెందవద్దని త్వరలోనే అర్హులైన వారందరికీ పథకాలు వర్తింప చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా వ్యవసాయం, విద్య శాఖలపై ప్రత్యేక దృష్టిని సారించినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల విద్యా బోధన లో ఎలాంటి నిర్లక్ష్యం వహించే రాదని ప్రభుత్వ పాఠశాలలో కనీసం 400 మంది విద్యార్థులు చదువుకునేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. బోధన పట్ల నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడమే కాకుండా విద్యాబోధనలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొనున్నట్లు ఆయన చెప్పారు. ఎగ్జామ్స్ కి మరో రెండు నెలలు గడువు ఉన్నందున ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ ద్వారా వారిని ప్రోత్సహించాలన్నారు. ఈనెల 17 లోపు ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్లో నమోదు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ మంజూరైన డబ్బులు లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజిని కిషోర్, గ్రామ సర్పంచ్ ఎమ్మెస్ రమేష్ కుమార్, బోధన ఆర్డీవో రాజా గౌడ్, తాసిల్దార్ రామచందర్, ఎంపీడీవో శంకర్, సూపరిండెంట్ శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి రామారావు, వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, మాజీ జెడ్పిటిసి నాగభూషణం రెడ్డి, స్థానిక నాయకులు సురేందర్ గౌడ్, జి సాయి రెడ్డి, సాయిబాబా గౌడ్, గ్రామ కార్యదర్శులు, అంగన్వాడి కార్యకర్తలు, ఆశలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love