ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతాం

We will constantly fight on public issues– గట్టుప్పల సీపీఐ(ఎం) నూతన శాఖ కార్యదర్శులు
నవతెలంగాణ – చండూరు 
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతామని సీపీఐ(ఎం) గట్టుప్పల మండల నూతన శాఖ కార్యదర్శులు కర్నాటి సుధాకర్, కర్నాటి వెంకటేశం, పెదగాని నరసింహ అన్నారు. గట్టుప్పల మండల కేంద్రంలో శాఖ మహాసభలో నూతనంగా ఎన్నికైన సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇండ్లు లేని నిరుపేదల కోసం ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, రేషన్ కార్డు లేని నిరుపేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. దళితులకు మూడెకరాల భూమిఇవ్వాలని, గత ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని మాట ఇచ్చి, మోసం చేశారనివారు ఆవేదన వ్యక్తం చేశారు. గట్టుప్పల  మండలంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం చేస్తామని తెలిపారు.  గట్టుపల్, పుట్టపాక మధ్యన ఉన్న ఫార్మా కంపెనీ వద్దని పోరాటాలు నిర్వహించామని  అన్నారు. ఈ దేశంలో బిజెపి పార్టీ చాలా ప్రమాదకరమని ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన బిజెపి పార్టీని ఓడించడం కోసం కృషి చేస్తామని వారు అన్నారు. రాముడు పేరుతో బిజెపి రాజకీయం చేయడం తగదనివారు అన్నారు. ప్రజా సమస్యలపైనిరంతరం పోరాడుతూ, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తామని వారు అన్నారు.
Spread the love