నల్లమల్లను పర్యటక హబ్ గా అభివృద్ధి చేస్తాం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

నవతెలంగాణ – అచ్చంపేట 
ప్రకృతి అందాలకు నిలయం నల్లమల్ల ప్రాంతం. అచ్చంపేట నియోజకవర్గం వర్గాన్ని పర్యటక హబ్ గా అభివృద్ధి చేస్తామని , వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని, లోక్ సభ ఎన్నికల్లో తనను అధిక మెజార్టీతో గెలిపించాలని టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం పదర మండలం మద్దిమడుగు క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గువ్వల బాలరాజు తో కలిసి ప్రచార ర్యాలీని ప్రారంభించారు. పదరా, అమ్రాబాద్. మండలాల లోని  ఇప్పలపల్లి, మారడుగు, ఉడిమిళ్ళ, చిట్లంకుంట వంకేశ్వరం ,పదర, అమ్రాబాద్ మన్ననూరు గ్రామాలలో ప్రచార ర్యాలీ. అమ్రాబాద్ మండల కేంద్రంలో రోడ్ షో లో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ అభ్యర్థిగా తనకు ఒకసారి అవకాశం కల్పిస్తే మీ గొంతు గా పార్లమెంటులో వినిపిస్తానని హామీ ఇచ్చారు. అమలు గాని 6 గ్యారంటీల పథకాల పేరుతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడని పథకాలు అమలు చేస్తుంది మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల రూ.2500 ఇస్తామని మేనిఫెస్టో బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ లోక్ సభ అభ్యర్థిగా  కేసీఆర్ ప్రకటించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులకు కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు పిలుపునిచ్చారు. రోడ్ షోకు ప్రజల ఆదరణ అపూర్వ స్పందన వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మాయ మాటలతో అధికారంలోకి రావడం జరిగింది తప్ప ఇచ్చిన ఒక హామీలను కూడా నెరవేర్చకుండా మాటల గారడితో ముందుకు పోతున్న ప్రభుత్వానికి చెంప చెల్లుమనే విధంగా ప్రజలు పార్లమెంట్ ఎన్నికలు తీర్పు ఇవ్వాలని సూచించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. ప్రతి ఒక్క కార్యకర్త ఓటర్ లిస్ట్ తీసుకొని ప్రజల వద్దకు వెళ్లాలని,  ప్రతి ఒక్కరినీ ఒక్కొక్క కార్యకర్త 100 మందిని కలవాలని సూచించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ రెడ్డి, జడ్పిటిసి సభ్యులు రాంబాబు నాయక్, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

Spread the love